గంపలగూడెం మండలం పెనుగొలను ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మండల టీడీపీ నాయకులు నాగళ్ళ మురళీ ఇంగ్లీష్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఇంగ్లీష్ ల్యాబ్ డిజిటల్ తరగతులకు, విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ఎంతో ఉపయోగపడుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏవి. నరసింహారావు తెలిపారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ భూతం అంజయ్య, గ్రంథాలయ అధికారిణి జె. శ్రీలత పాఠశాల ఉపాధ్యాయులు యం. రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.