పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాడిన కారల్ మార్క్స్ 142వ వర్ధంతిని తిరువూరు సీపీఐ సుంకర వీరభద్ర భవన్ లో ఘనంగా నిర్వహించారు. సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తూము. కృష్ణయ్య, కారల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ తిరువూరు నియోజకవర్గ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, ఆటో వర్కర్స్ నాయకులు పాల్గొన్నారు.