తిరువూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో వాగులు వంకలు పొంగిపొర్లు తున్నాయి. శనివారం భారీ వర్షం కురవడంతో ప్రధాన రహదారులు వెంబడి వర్షపు నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. వాగులు పొంగి రోడ్డుపై ప్రమాదకరంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. తిరువూరు మండలం పూనుకుళ్ళు లో వాగుకు వరద నీరు పోటెత్తింది. దీంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు.