వైసిపి సర్పంచ్ ని కలిసిన టిడిపి ఎమ్మెల్యే

55చూసినవారు
వైసిపి సర్పంచ్ ని కలిసిన టిడిపి ఎమ్మెల్యే
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల ఏ. కొండూరు మండలం రేపూడి గ్రామాల్లో తిరువూరు ఎమ్మెల్యే కే. శ్రీనివాసరావు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా రేపూడి గ్రామ వైసిపి సర్పంచ్ వజ్రాల సత్యవాణి బ్రహ్మారెడ్డి దంపతులను ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీలకతీతంగా గ్రామ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేద్దామని సర్పంచ్ కు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్