తిరువూరు నియోజవర్గ పరిధిలోగల
గంపలగూడెం మండలం వినగడప- తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగుపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. మండల కేంద్రం నుండి విజయవాడ, నూజివీడుకు వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. 20 గ్రామాలకు రాకపోకలు బంద్ కావడంతో వాహన దారులు అవస్థలు పడుతున్నారు. ప్రమాదాలు జరగకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.