కేంద్రం అమలు చేస్తోన్న PM-KUSUM పథకం కింద సోలార్ పంపులు, సోలార్ పవర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి ఏర్పాటుకు కావాల్సిన వ్యయం మొత్తంలో కేంద్రం 60% సబ్సిడీగా, 30% రుణంగా అందిస్తుంది. రైతుల బృందం, పంచాయతీలు, సహకార సంస్థలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్‌ను డిస్కమ్‌లకు విక్రయించవచ్చు. వివరాలకు pmkusum.mnre.gov.in చూడొచ్చు.