ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బుధవారం రాత్రి కారు ట్రాక్టర్ ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో కారు డ్రైవర్ ఉన్నారని స్థానికులు తెలిపారు. మధిర రోడ్డు దేవాసముద్రం దగ్గర ట్రాక్టర్ ఢీకొట్టిందన్నారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండి అతివేగంతో ట్రాక్టర్ ని ఢీకొని కారు పల్టీ కొట్టిందన్నారు. గాయపడినవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.