తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలనులో గురువారం మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన రంగా రావు వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోహన్ రంగ అభిమాన సంఘం కమిటీ సభ్యులు రామి శెట్టి రామయ్య, రాళ్లచర్ల రామకృష్ణ, పలువురు జనసేన, టిడిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.