మాజీ మంత్రి వసంత్ కుమార్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు

80చూసినవారు
మాజీ మంత్రి వసంత్ కుమార్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు
ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధికి మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పాత్ర గొప్పదని, ఆయన స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శనీయమని భీమడోలు జనసేన నాయకులు అన్నారు. సోమవారం మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ జయంతి వేడుకలను
పురస్కరించుకుని అభిమానులు, జనసేన శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్