ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘’ఏపీలో వెనుకబడిన జిల్లాలకు కేంద్ర సాయం అందిస్తోంది. రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఏడాదికి రూ.50కోట్లు చొప్పున సహకారం ఇస్తున్నారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.269 కోట్లు కేటాయించారు’’ అని ఆమె తెలిపారు.