గుడ్లవల్లేరు ఘటన బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. విద్యార్థుల జీవితాలు అతలాకుతలంచేసే ఘటన ఇది అని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని, 3 నెలల్లో విద్యావ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. కాలేజీలపై పర్యవేక్షణ లోపం కనిపిస్తోందన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో మునిగిపోయి, ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందన్నారు.