విజయవాడలో ఓ మహిళ రన్నింగ్ ట్రైన్లో నుంచి అమాంతం కింద ఉన్న కాలువలోకి దూకేసింది. ఆమె నీటిలో కొట్టుకుపోయి, చెట్టు కొమ్మను పట్టుకుని 10 గంటల పాటు నిల్చుంది. బాపట్ల జిల్లా భట్టిప్రోలులో నివాసం ఉన్న షేక్ ఖాదర్‌వలి భార్య జిన్న తున్నీసా (47) మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఆమె గతంలో కూడా కుటుంబానికి తెలియకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా, ఈసారి కూడా శనివారం రాత్రి ట్రైన్‌లోకి ఎక్కి ఇలా దూకేసింది.