వివాదాలకు కేరాఫ్ అడ్రస్ విజయవాడ
విజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేదరాశ్వర్ పేట గాంధీనగర్ ఏలూరు లాకులు తదితర ప్రాంతాలు వివాదాలకు నిలయంగా మారుతుంది. ఇక్కడ ప్రతిరోజు నిత్యం యువకులు మద్యం గంజాయి మత్తులో వివాదాలకు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. బుధవారం ఓ ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ప్రాంతంలో పోలీసు నిఘా కరువైందని స్థానికులు తెలుపుతున్నారు. ఇటువంటి ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.