విజయవాడ వైసీపీ నేత పోతిన మహేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను లాజిక్ తో ఇరికించారు. ఇటీవల ఆయన పిఠాపురం వరద బాధితులను పరామర్శించడంపై స్పందించారు. విజయవాడలో బుడమేరు వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యలకు తాను వెళ్తే అంతరాయం కలుగుతుందని పవన్ చెప్పుకొచ్చారు. అదే లాజిక్ పిఠాపురంలో వర్తించదా అని పోతిన నిలదీశారు. పవన్ పిఠాపురానికి మంత్రా? ఏపీకి మంత్రా అని ప్రశ్నించారు.