విజయవాడలో మరోసారి లయోలా వాకర్స్ కు చేదు అనుభవం. ఆదివారం అనుమతి ఇచ్చినట్టు ఇచ్చి సోమవారం కాలేజీ యాజమాన్యం గేట్లు మూసివేసింది. దీంతో కాలేజీ గేట్ దగ్గర వాహనాలు అడ్డుగా పెట్టి లయోలా వాకర్స్ నిరసన చేపట్టారు. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చేశారు. దీంతో అక్కడ గందరగోల వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసిన ప్రయోజనం లేకపోవడంతో కాలేజీ యాజమాన్యంతో చర్చకు దిగారు.