ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ షాపుల కేటాయింపు నిమిత్తం ఈ నెల 11న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో లాటరీ నిర్వహిస్తామని అబ్కారీ అధికారి ఎస్. శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. మద్యం షాపుల అప్లికేషన్ ధర రూ. 2లక్షలుగా నిర్ణయించామని, ఆఫ్లైన్ & ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఈ నెల 9 వరకు స్వీకరిస్తామన్నారు.