శ్రీ దుర్గా దేవి సౌందర్యలహరి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ లో ఆదివారం ఆవిష్కరించారు. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ లో జరిగిన పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా నవరాత్రులలో కొత్త విధానం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు.