కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమొండి–గొల్లమంద రోడ్డు ఇటీవలి భారీ వరదలతో ఛిద్రమైంది. ఈ రోడ్డు పునర్నిర్మాణానికి రూ. 13. 45 కోట్లు వ్యయంతో అంచనాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిపవన్ కళ్యాణ్ ముందు ఉంచారు. ఈ రోడ్డు పరిస్థితిపై కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, పంచాయతీరాజ్ ఈ. ఎన్. సి. బాలు నాయక్ వివరించారు.