విజయవాడ దసరా ఉత్సవాలకు సంబంధించిన సమస్త సమాచారం భక్తులకు అందుబాటులో ఉంచేందుకు‘దసరా 2024' యాప్ను గురువారం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో దర్శనవేళలు, దర్శన టికెట్ల కొనుగోళ్ల కౌంటర్లు, పార్కింగ్ ప్రదేశాలు వంటి వివరాలను పొందుపరిచారు. 94418 20717వాట్సాప్ నంబరుకు హాయ్, అమ్మ అని మెసేజ్ చేస్తే భక్తులకు అవసరమైన సమాచారం తెలుసుకునేలా ఏర్పాటు చేశారు.