సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టింది. 2024లో ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తరవాత తొలి సారి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీ సెంటర్ ను సందర్శించారు.