విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల మూడువ తారీఖు ( రేపటి) దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే వాహనాలను వేర్వేరు మార్గాల్లో పంపాలని నిర్ణయించారు. బుధవారం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వస్తాయని పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు.