తన భర్త పాలడుగు దుర్గాప్రసాద్ పై పలు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎంపీపీ పాలడుగు జోత్స్న ఘాటుగా స్పందించారు. ఇబ్రహీంపట్నంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాలడుగు జోత్స్న మాట్లాడుతూ బూడిద గ్రావెల్ వ్యవహారాలలో గత ప్రభుత్వంలో గాని ఈ ప్రభుత్వంలో కానీ తమ ప్రమేయం ఉందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు.