విజయవాడ రైల్వే స్టేషన్ కు అరుదైన గుర్తింపు

59చూసినవారు
విజయవాడ రైల్వే స్టేషన్ కు అరుదైన గుర్తింపు
పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహార విధానాలను అవలంబించినందుకు ఫుడ్‌సేఫ్టీ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి విజయవాడ రైల్వేస్టేషన్‌కు ఈట్‌ రైట్‌స్టేషన్‌ ధ్రువీకరణ లభించింది. అన్నవరం, గుంటూరు, నడికుడి, హైదరాబాద్‌లోని నాంపల్లి స్టేషన్‌ తర్వాత ఎస్‌ఈఆర్‌ జోన్‌ లో ఐదో స్టేషన్‌గా, విజయవాడ డివిజన్‌లో రెండోదిగా విజయవాడ రైల్వేస్టేషన్‌ నిలిచింది. 85 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి 5స్టార్‌ గుర్తింపు పొందింది. విజయవాడ నుంచి రోజూ లక్ష మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

సంబంధిత పోస్ట్