విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో గురువారం ఉదయం గ్యాస్ లీకై అగ్ని ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఇంట్లో గ్యాస్ లీక్ అవడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో భార్గవి(27) తీవ్రంగా గాయపడింది. స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం సమయంలో మహిళ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు.