బుడమేరు వరదలు, భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు దేశంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేవలం పక్షం రోజుల్లోనే నష్ట పరిహార సాయం అందించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వరదల వల్ల రాష్ట్రంలో మొత్తం రూ. 7600 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బుధవారం విజయడలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వరదబాధితులకు పరిహార పంపిణీ కార్యక్రమం జరిగింది.