ఆలూరు పట్టణ కేంద్రంలో సోమవారం గ్రామస్తులు తాగేందుకు నీళ్లు లేవని పలుకాలనీవాసులు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. మరియు రోడ్డుపై రాస్తారోకో చేపట్టి వాహనాలను ఆపి రాకపోకలకు అంతరాయం కలిగించారు. వారు మాట్లాడుతూ, గత 20 రోజులుగా నీటి వసతి కరువైందని దీంతో చేసేదేమీ లేక ఆందోళనకు దిగాల్సి వచ్చిందని ఇప్పటికైనా ఉన్నతాధికారు లు స్పందించి తాగునీటి సమస్యను తీర్చాలని అధికారులకు విన్నవించారు.