దేవనకొండ మండలంలోని అలారుదిన్నెలో ముంపునకు గురైన పత్తి, టమోట పంటలను సోమవారం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సుజాత, కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి డైరక్టర్ రాఘవేంద్ర పరిశీలించారు. పత్తి ముంపుకు గురైతే పిందెలు, కాయలు రాలిపోవడం, ఆకులు ఎర్రబారి పడిపోతాయన్నారు. పోటాషియం నైట్రేట్, యూరియా వ్యవసాయాధికారుల సలహా మేరకు పిచికారీ చేసుకోవాలన్నారు. టమోటకు బ్యాక్టీరియా స్పాట్ తెగులు కనిపించిందన్నారు.