వర్షాభావ పరిస్థితుల మూలంగా ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన పంటలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, కనీసం రబీ కింద పప్పు శనగ సాగు చేసుకునేందుకు విత్తనాలు సకాలంలో ఇప్పించాలని మంగళవారం కోడుమూరులో రైతులు వ్యవసాయ కమిషనరేట్ జేడీఏ కృపాదాస్, జిల్లా వ్యవసాయాధికారిణి వరలక్ష్మిని కోరారు. వారు కోడుమూరు వ్యవసాయ కార్యాలయాన్ని సందర్శించారు. నెలాఖరు నుంచి రబీకింద శనగ పంట సాగు చేస్తామని, ముందుగానే విత్తనాలిస్తే బాగుంటుందన్నారు.