గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి: ఆర్డీవో శేషిరెడ్డి

69చూసినవారు
గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి: ఆర్డీవో శేషిరెడ్డి
గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కర్నూలు ఆర్డీవో శేషిరెడ్డి, హౌసింగ్‌ పీడీ సిద్ధలింగమూర్తి లబ్ధిదారులకు సూచించారు. బుధవారం గూడూరులో పర్యటించిన ఆర్డీవో, పీడీలు ప్రభుత్వ లేవుట్‌ను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి నాటికి గృహాలన్నింటిని పూర్తి చేసుకోవాలన్నారు. వెలుగు కార్యాలయంలో గృహ నిర్మాణాలపై సమావేశమయ్యారు. ఇంకా గృహ నిర్మాణాలు జరగాల్సినవి ఎన్ని ఉన్నాయో అనేదానిపై సమీక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్