కర్నూలు జిల్లాలోని పత్తికొండను ఛాలెంజింగ్‌గా తీసుకుని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. మంగళవారం మద్దికెర ఎంపీడీవో కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 23 లక్షలు విలువ చేసే వాహనాలను 96 మంది దివ్యాంగులకు పంపిణీ చేశారు. వారు మాట్లాడారు. పత్తికొండ తాలుకాలో 68 చెరువులను హంద్రీనీవా నీరు నింపుతామన్నారు. వైసీపీ హయాంలో 30 శాతం పనులు కూడా చేయలేదని విమర్శించారు.