పెద్దకడుబూరు మండలం, కల్లకుంట గ్రామంలో సామాజిక హింసకు పాల్పడిన అందరి పైన కేసు నమోదు చేయాలని.. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రు మల్యాద్రి, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ దేవసహాయం డిమాండ్ చేశారు. దాడికి గురైన మాదిగ గోవిందమ్మ ను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు పరామర్శించి ఆమెకు జరిగినటువంటి దాడి పైన గల కారణాలు అడిగి పాల్గొన్నారు.