ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

71చూసినవారు
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కర్నూలు జిల్లా గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988-89 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు.. 35 సంవత్సరాల తర్వాత ఆదివారం అదే పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో ఒకటయ్యారు. చదివిన పాఠశాలలోనే స్నేహితులంతా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించుకున్నారు. 35సంవత్సరాల క్రితం గడిపిన మధుర జ్ఞాపకాలను స్మరించుకొని ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గురువులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్