ఎన్నికల ముందు ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఎమ్మిగనూరులో రెండు అన్న క్యాంటిన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ..
పేదవాడి ఆకలి తీర్చేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారని తెలిపారు.