సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం పోలీస్ స్టేషన్ లో టీడీపీ మాజీ జడ్పీ వైస్ ఛైర్ పర్సన్ పుష్పావతి, ఆమె భర్త టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు నాగరాజు గౌడ్ ఫిర్యాదు చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తమ కుటుంబం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తోందని, కొంతమంది తమపై అసత్యాలు ప్రచారం చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు.