గోనెగండ్ల మండలం పెద్దనేలటూరుకు చెందిన మహ్మద్, యాసిన్ బీ దంపతుల కూతురు సాదియా, కుమారుడు ఉమ్మేసహన్ తెలంగాణ రాష్ట్రం గద్వాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. కరాటే పోటీల్లో అక్క, తమ్ముడు ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్స్ సాధించారు. జాతీయ క్రీడలకు సైతం ఎంపిక కావడం పట్ల గ్రామస్థులు వారిని ఆదివారం అభినందించారు. ఆగస్టు నెలలో జరిగే జాతీయస్థాయి కరాటే పోటీల్లో వీరు పాల్గొననున్నారు.