దళిత మహిళపై దాడి ఘటనపై సమగ్ర విచారణ చేయాలి

64చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంటకు చెందిన దళిత గోవిందమ్మను వివస్త్రను చేసి విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడి హేయమైన చర్య అని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన ఎమ్మిగనూరులో మాట్లాడుతూ ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని అన్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కల్లుకుంట గ్రామానికి వెళ్లి సమగ్ర విచారణ జరిపి ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్