ఆదోని మండలంలోని పెద్దతుంబళంకు చెందిన ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం తిమ్మప్ప ఆలయంలో పూజలు ముందు చేసేక్రమంలో గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి, కాశీం కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణకు దారితీసింది. ఆరుగురు గాయపడగా, ఆదోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాలకు చెందిన ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.