ఆదోని మండలం కడితోట గ్రామ సమీపంలో ఆదివారం కారు, ఆటో ఢీకొని నలుగురికి గాయాలయ్యాయి. అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదోని నుంచి పెద్దతుంబళం వైపు వెళ్తున్న ఆటో, మంత్రాలయం నుంచి ఆదోని వైపునకు వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటోలో ఉన్న సుహాసిని, అమీన్, ఈరన్నగౌడ్, నరసింహులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.