ఆదోని పట్టణంలోని దొంగలు రెచ్చిపోయారు. రైతు బజారులోని మూడు కిరాణా షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. గురువారం అర్ధరాత్రి షాపుల పైకప్పుకు కన్నం వేసి లోపలికి ప్రవేశించి అందినకాడికి దోచుకెళ్లారు. యజమాని సికిందర్ దుకాణంలో రూ. 3 వేలు నగదు, రూ. 10 వేలు విలువ జేసే సరుకులు, వీరేష్ దుకాణంలో రూ. 1, 500, లక్ష్మన్న దుకాణంలో రూ. 2 వేలు నగదును అపహరించారు. సీఐ సూర్యమోహన్ రావు శుక్రవారం దుకాణాలను పరిశీలించి కేసు నమోదు చేశారు.