దళితుల పట్ల వివక్ష చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదోని తహసీల్దార్ శివరాముడు, రూరల్ సీఐ నల్లప్ప, పెద్దతుంబళం ఎస్సై డి. మహేష్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం ఆదోని మండలంలోని జి. హొసళ్ళి గ్రామంలో దేవర సందర్భంగా అగ్ర కులాల వారు వివక్ష చూపారని దళితులు తహసీల్దార్, ఎస్సైకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు గ్రామంలో పర్యటించారు. సామరస్య పూర్వకంగా జాతర నిర్వహించుకోవలని సూచించారు.