ఆదోని: పన్నులు చెల్లించకపోతే కుళాయి కనెక్షన్ కట్ చేస్తాం

53చూసినవారు
ఆదోని: పన్నులు చెల్లించకపోతే కుళాయి కనెక్షన్ కట్ చేస్తాం
ఆదోని మున్సిపాలిటీలో ఇంటి, నీటి పన్నులను సకాలంలో చెల్లించకపోతే కుళాయి కనెక్షన్ కట్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ హెచ్చరించారు. శుక్రవారం ఆదోనిలో మాట్లాడారు. ఏటా మున్సిపాలిటీకి చెల్లించాల్సిన ఆస్తి, నీటి పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మున్సిపాలిటీలో ఆస్తి పన్ను రూ. 15 కోట్లకు గానూ రూ. 7 కోట్లు, నీటిపన్ను రూ. 7 కోట్లకు గానూ రూ. 2 కోట్ల పైచిలుకు వసూలైందని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్