టీడీపిలో చేరిన కుప్ప‌గ‌ల్ స‌ర్పంచి

56చూసినవారు
టీడీపిలో చేరిన కుప్ప‌గ‌ల్ స‌ర్పంచి
ఆదోని మండ‌లం కుప్ప‌గ‌ల్ స‌ర్పంచి నాగిరెడ్డి సోమ‌వారం టీడీపిలో చేరారు. ఆదోనిలోని నివాసంలో నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జీ, రాష్ట్ర ఉపాధ్య‌క్షులు మీనాక్షి నాయుడు పార్టీ కండువా క‌ప్పి సాదారంగా ఆహ్వానించారు. స‌ర్పంచి మాట్లాడుతూ ప‌థ‌కాల‌కు ఆక‌ర్షితులై, చంద్ర‌బాబుతోనే అభివృద్ధి సాధ్య‌మ‌ని పార్టీలో చేరిన‌ట్లు తెలిపారు. క‌లిసిక‌ట్టుగా ఆదోని అభివృద్ధికి కృషి చేద్దామ‌ని మీనాక్షి నాయుడు సూచించారు.

సంబంధిత పోస్ట్