పత్తికొండ: అదానీ చీకటి ఒప్పందాలు రద్దు చేయాలి

54చూసినవారు
అదానీ చీకటి ఒప్పందాలు రద్దు చేయాలని పత్తికొండలో సీపీఐ నాయకులు నబీ రసూల్ డిమాండ్ చేశారు. మంగళవారం పత్తికొండలోని నాలుగు స్తంభాల కూడలిలో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, మాట్లాడారు. విద్యుత్ కొనుగోలుపై ఆదానితో ప్రధాని మోడీ చీకటి ఒప్పందాలు అవినీతి కుంభకోణాలపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయరాదని కోరారు. రాజా సాహెబ్, సురేంద్ర, కృష్ణయ్య ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్