రుద్రవరం మండలంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ దోర్వి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రుద్రవరం గ్రామానికి చెందిన నారాయణ నంద, శ్రీహరి నారాయణ నంద, పార్థసారథి ప్రొద్దుటూరు వారి తండ్రి నారాయణ పుల్లయ్య జ్ఞాపకార్థం రూ. 25,116/- విరాళం శనివారం అందించారు. ఆలయ అభివృద్ధికి దాతల సహకారం అవసరం అని నల్లగట్ల వెంకటేశ్వర్లు శెట్టి, గాంతి బండల శీను తెలిపారు.