ఆళ్లగడ్డడి. ఎస్. పి రవికుమార్ ఆదేశాల మేరకు ఆదివారం పట్టణ పరిధిలోని శివారు ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం పట్టణంలోని స్టేడియం సమీపంలో బహిరంగ మద్యపానం సేవిస్తున్న యువకులు డ్రోన్ కెమెరాలను చూసి పరారయ్యారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు.