ఈ నెల 12న జరుగబోయే దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ అన్నారు. హొళగుంద మండలం, దేవరగట్టులో బన్ని ఉత్సవ ఏర్పాట్లపై శనివారం సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, దేవస్థాన కమిటీ సభ్యులతో సమీక్షించారు. దేవరగట్టులో జరిగే బన్ని ఉత్సవంకు సంబంధించి పటిష్టభద్రత, బందోబస్తు ఏర్పాట్లపై దేవరగట్టుకు రావడం జరిగిందన్నారు.