ప్రస్తుతం ఉన్న సమాజంలో విద్యను అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని అలవర్చుకోవాలని బేతంచెర్ల మండల విద్యాధికారి సోమశేఖర్ డ్రైవర్స్ కాలనీ ఎంపీ యూపీ ప్రధానోపాధ్యాయులు పుల్లయ్య శుక్రవారం అన్నారు. బేతంచెర్ల మండల కేంద్రంలోని డ్రైవర్స్ కాలనీ యందున్న మండల ఎంపియుపి స్కూలుకు, జ్ఞాన నిధి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో 25 వేల రూపాయలు విలువచేసే మైక్ సెట్, స్పీకర్ మరియు ప్రింటర్ ను ప్రధానం చేశారు.