సంజామల మండలంలోని ఫీడర్ల పరిధిలో వ్యవసారంగానికి పగటివేళ 9 గంటలకు సరఫరా చేస్తున్నట్లు ఏఈ దుర్గా శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంజామల ఆకుమల్ల, పేరుసోముల సబ్ స్టేషన్ల పరిధికి సంబంధించి విద్యుత్ సరఫరా వేళలు వివరించారు. ముక్కవల్ల, వసంతాపురం, కమలాపురి, గిద్దలూరు, రెడ్డిపల్లి గ్రామాల ఫీడర్ల పరిధిలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారు.