చంద్రబాబును విమర్శించే స్థాయి కాటసాని రామిరెడ్డికి లేదు

1069చూసినవారు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి లేదని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం బనగానపల్లెలో బీసీ మాట్లాడారు. చంద్రబాబు రుణమాఫీ చేయలేదని రామిరెడ్డి అంటున్నారని, ప్రతి రైతుకు రూ. లక్ష వరకు చేసిందని, రుజువులు చూపుతామన్నారు. నవరత్నాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి, నిబంధనలు విధించి పేదల పొట్టకొట్టారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్