బండి ఆత్మకూరు: ఉరేసుకుని మహిళ మృతి
నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో గోల్ల కాశి భార్య వెంకట లక్ష్మమ్మ సోమవారం ఉరేసుకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకట లక్ష్మమ్మకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.